Pak's newly appointed T20I captain Babar Azam seeks inspiration from modern-day greats Kane Williamson and Virat Kohli, and wants to emulate them as captain in his first international assignment as a leader in Australia series.
#viratkohli
#kanewilliamson
#babarazam
#teamindia
#cricket
#t20worldcup
#srilanka
#australia
#FakharZaman
#ImamulHaq
సారథ్యంలో విరాట్ కోహ్లీని,కేన్ విలియమ్సన్‌ను ఆదర్శంగా తీసుకుంటానని పాక్ టీ20 కెప్టెన్ బాబర్ అజామ్ అన్నాడు. శ్రీలంకతో సొంతగడ్డపై జరిగిన మూడు టీ20ల సిరిస్‌ను పాక్ కోల్పోవడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సర్ఫరాజ్ అహ్మద్‌పై వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ టీ20 జట్టుకు బాబర్ అజాం కెప్టెన్‌గా నియమిస్తూ పీసీబీ నిర్ణయం తీసుకుంది.బాబర్ అజాం నాయకత్వంలోని పాకిస్థాన్ జట్టు త్వరలో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఆస్ట్రేలియా పర్యటనలో పాక్ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. నవంబర్ 3న సిడ్నీ వేదికగా తొలి టీ20 జరగనుంది. ఈ నేపథ్యంలో బాబర్ అజాం మాట్లాడుతూ "ప్రతి పర్యటన కఠినమైనదే. అయితే, అదనపు బౌన్స్ కారణంగా ఆస్ట్రేలియా పర్యటన సవాల్ చేస్తుంది. కానీ మేము ఎప్పటిలాగే విజయాల కోసం వెళ్తాం" అని అన్నాడు.